
షోస్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ భద్రతను మరింత పెంచారు. ఢిల్లీ, ఆగ్రాలోని ఆయన నివాసాలతో పాటు ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన వ్యక్తిగత భద్రతను కూడా పెంచారు.
ఢిల్లీలోని ఆయన నివాసానికి సమీపంలో ఆందోళనకారులు చేరుకున్న నేపథ్యంలో భద్రతా అధికారులు ముప్పు స్థాయిని మరోసారి అంచనా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం జ్ఞానేశ్ కుమార్‌కు Z+ స్థాయి భద్రత కొనసాగుతుండగా, తాజా పరిణామాల నేపథ్యంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!