23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

Writer: Pooja 04:46 PM, 23 నవంబర్, 2026
రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌పై యువ ఆటగాడు ధ్రువ్‌ జురెల్‌ ప్రశంసలు కురిపించాడు. పంత్‌ను అద్భుతమైన ఆటగాడిగా అభివర్ణించిన జురెల్‌.. అతడిని తన మెంటార్‌గా భావిస్తానని తెలిపాడు. బ్యాటింగ్‌ చేసేటప్పుడు మానసిక స్థితిని ఎలా ఉంచుకోవాలో పంత్‌ను తరచూ అడుగుతుంటానని చెప్పాడు. సాధారణంగా ఆడతాడని భావించే సమయంలోనే క్రీజు వదిలి ముందుకు వచ్చి భారీ షాట్లు ఆడటం పంత్‌ ప్రత్యేకత అని పేర్కొన్నాడు. అతడి ఆటతీరు తనకు ఎంతో ఇష్టమని, పంత్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటానని వెల్లడించాడు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌ చేయడమే తన బలమని జురెల్‌ చెప్పాడు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు జట్టుకు ఎలాంటి బాధ్యత అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశాడు.

న్యూజిలాండ్‌లో టెస్టు మ్యాచ్‌ల ఫలితాలను పిచ్‌ కంటే అక్కడి వాతావరణ పరిస్థితులే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని జురెల్‌ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో నాలుగో రోజు పంత్‌, జురెల్‌ కలిసి అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. కేవలం 14 ఓవర్లలోనే 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రిషబ్‌ పంత్‌ 153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128 పరుగులు చేసి శతకం సాధించాడు. ఈ సెంచరీతో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా (సేనా) దేశాల్లోనూ టెస్టు శతకాలు సాధించిన ఘనతను అందుకున్నాడు. మరోవైపు ధ్రువ్‌ జురెల్‌ 79 బంతుల్లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

ట్యాగ్లు
ధ్రువ్ జురెల్రిషబ్ పంత్టీమ్ ఇండియాభారత క్రికెట్టెస్ట్ క్రికెట్న్యూజిలాండ్ టెస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత
క్రీడలు

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌
క్రీడలు

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
జనరల్

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఈ ఆదివారం స్టార్ మా‌లో ‘బ్లాస్ట్’ సినిమా సందడి
షోస్

ఈ ఆదివారం స్టార్ మా‌లో ‘బ్లాస్ట్’ సినిమా సందడి

‘జ్వాలా ఎంకే-1’ డ్రోన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం!
జనరల్

‘జ్వాలా ఎంకే-1’ డ్రోన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం!

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’
సినిమాలు

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’

వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం.. చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం.. చంద్రబాబు కీలక ఆదేశాలు

అండాల అక్రమ సేకరణ కేసు.. ఇద్దరు డాక్టర్ల ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత!
జనరల్

అండాల అక్రమ సేకరణ కేసు.. ఇద్దరు డాక్టర్ల ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత!

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి
గాసిప్స్

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి

కార్తిక పౌర్ణమి దీపారాధన గురించి స్కాందపురాణం ఏం చెబుతోంది?
జనరల్

కార్తిక పౌర్ణమి దీపారాధన గురించి స్కాందపురాణం ఏం చెబుతోంది?

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!
రాజకీయాలు

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర
రాజకీయాలు

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!