
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. త్వరలో కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేసి, వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు సీఎం తెలిపారు.
మహిళల కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసే కొత్త ఏసీ బస్సులు డిపోలకు చేరిన వెంటనే ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే సూపర్ లగ్జరీ, అంతర్రాష్ట్ర, తిరుమల సప్తగిరి బస్సులకు స్త్రీశక్తి పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. కొత్త ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తే మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రజా రవాణా అవకాశం లభించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!