

మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రాల సహకారం కోరారు. ఈ మేరకు తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, యంత్రాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం సిబ్బందితో పాటు అవసరమైన యంత్రాలను పంపిస్తామని హామీ ఇచ్చారు.
సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో వివిధ రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన సిబ్బంది కూడా తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అందే సహకారంతో పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!