

తమ దేశానికి సంబంధించిన సున్నితమైన సముద్ర సమాచారాన్ని సేకరించేందుకు విదేశీ గూఢచార సంస్థలు తాబేళ్లు, చేపలు వంటి సముద్ర జీవులను ఉపయోగిస్తున్నాయని చైనా ఆరోపించింది. సముద్ర జీవులకు ప్రత్యేక సెన్సర్లు అమర్చి చైనా తీర ప్రాంతాల్లో వదులుతున్నట్లు చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ సోషల్ మీడియాలో వెల్లడించింది. సముద్ర పర్యావరణం, తీర ప్రాంతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారని పేర్కొంది.
చైనా తీర జలాల్లో సెన్సర్లు అమర్చిన తాబేళ్లు, చేపలను గుర్తించినట్లు భద్రతా మంత్రిత్వశాఖ తెలిపింది. ఇవి నీటి ఉష్ణోగ్రత, లవణీయత, సముద్ర ప్రవాహాలు వంటి సమాచారాన్ని సేకరించి ఉపగ్రహాల ద్వారా విదేశాలకు పంపుతున్నాయని ఆరోపించింది. అలాగే సౌరశక్తితో పనిచేసే వేవ్ గ్లైడర్లు, నిఘా పరికరాలను సరకు నౌకలపై అమర్చి తీర ప్రాంత వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా విదేశీ నౌకలు, పరికరాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని అధికారులు ఆదేశించగా, మత్స్యకారులు అనుమానాస్పద వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!