
సినిమాలు

అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజా షూటింగ్ షెడ్యూల్‌పై ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ ఎంట్రీ సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు బన్నీ కొత్త వైల్డ్ లుక్‌లో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మాఫియా నేపథ్యంలో ఓ శక్తివంతమైన డాన్ చుట్టూ కథ సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో దీపికా పడుకోణె ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!