
సినిమాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే శాకంబరి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జగన్మాతను ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక బృందాల సహాయంతో సుమారు 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలను సేకరించగా, విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌తో పాటు రైతులు అందించిన మరో 4 టన్నుల పండ్లను కూడా అలంకరణలో వినియోగిస్తున్నారు.
పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని దేవస్థానం స్పష్టం చేసింది. దర్శనానికి వచ్చే ప్రతి భక్తికి ఉచితంగా కదంబం ప్రసాదం అందించడంతో పాటు, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!