

చైనా రాయబారి జు ఫీహోంగ్, ఆయన సతీమణి టాన్ యుక్సియు అక్టోబర్ 16 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ 2026కు వారు హాజరుకానున్నారు. ఈ ఉత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చైనా రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. భారత్, చైనా దేశాలకు గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపద ఉందని పేర్కొన్న ఆయన, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా జు ఫీహోంగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భారత్–చైనా దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించే మార్గాలు, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య పరస్పర ఆదానప్రదానాలను పెంపొందించే అంశాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, విజయవాడ ఉత్సవ్ 2026కు చైనా రాయబారి హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!