
జనరల్

విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తాపడింది. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన విద్యార్థులు పిక్నిక్ కోసం కైలాసగిరికి వచ్చారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన పాఠశాలదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!