28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

Writer: Chandrika 04:59 PM, 28 నవంబర్, 2026
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా దేశం మరో కీలక ముందడుగు వేయబోతోందని పేర్కొన్నారు. ఈ రెండు బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 1986లోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 60 శాతం సీట్లు మహిళలకే దక్కాయని తెలిపారు. ప్రతిపాదిత సీట్ల పెంపుతో ప్రతి రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి ఎలాంటి భంగం కలగదని చంద్రబాబు వివరించారు.

1971లో ఒక ఎంపీ సుమారు 10 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 27 లక్షలకు చేరిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపాదిత సీట్ల పెంపుతో ఒక్కో ఎంపీ ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య సుమారు 18 లక్షలకు తగ్గుతుందని, తద్వారా ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయకుండా అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి రెండు బిల్లులను ఏకాభిప్రాయంతో ఆమోదించాలని కోరారు. మహిళలకు దక్కాల్సిన న్యాయమైన ప్రాతినిధ్యాన్ని నిరాకరించడమే ఈ బిల్లులను వ్యతిరేకించడమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుమహిళా రిజర్వేషన్ బిల్లుడీలిమిటేషన్ బిల్లుఆంధ్రప్రదేశ్ రాజకీయాలునరేంద్ర మోదీమహిళా సాధికారతలోక్‌సభ స్థానాలుఆంధ్రప్రదేశ్ అసెంబ్లీదక్షిణాది రాష్ట్రాలుభారత పార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..
జనరల్

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..
సినిమాలు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్
జనరల్

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..
రాజకీయాలు

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..
జనరల్

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..
జనరల్

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..
జనరల్

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..
జనరల్

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!