

బంగ్లాదేశ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌కు ఐదు గంటలపాటు పెరోల్ మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందిన ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అధికారులు ఈ తాత్కాలిక అనుమతి ఇచ్చారు. చిట్టగాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మహ్మద్ జాహిదుల్ ఇస్లాం మియా కుటుంబ సభ్యులు చేసిన అభ్యర్థనను పరిశీలించిన అనంతరం పెరోల్‌కు అనుమతించినట్లు సమాచారం. హతాజారీకి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం నిర్ణీత గడువులోపు చిట్టగాంగ్ సెంట్రల్ జైలుకు తిరిగి చేరుకోవాల్సి ఉంది.
సంధ్యా రాణి తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలోనే చిన్మయ్ కృష్ణ దాస్‌ను పెరోల్‌పై విడుదల చేయాలని కుటుంబ సభ్యులు కోరినప్పటికీ, నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని అధికారులు అప్పట్లో తెలిపారు. ఆమె మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు మరోసారి దరఖాస్తు చేయడంతో తాజాగా పెరోల్ మంజూరైంది. చిన్మయ్ కృష్ణ దాస్‌ను 2024 నవంబర్‌లో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. అనంతరం హత్య, హత్యాయత్నం, విధ్వంసం తదితర ఆరోపణలకు సంబంధించిన పలు కేసుల్లోనూ ఆయన పేరు చేర్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!