
రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య నివాసానికి వెళ్లారు. చుక్కా రామయ్య వందో జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యారంగంలో విశేష సేవలందించిన చుక్కా రామయ్యకు సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. చుక్కా రామయ్య వందో జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!