
గాసిప్స్

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆది పరాశక్తి, జగజ్జనని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ పవిత్ర బోనాల మహోత్సవం ప్రతి భక్తుడి జీవితంలో ఆనందం, ఆధ్యాత్మిక చైతన్యం, శుభసంకల్పాలను నింపాలని సీఎం కోరుకున్నారు. భక్తిశ్రద్ధలతో సమర్పించే ప్రతి బోనం అమ్మవారికి ప్రీతికరమై, ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!