

స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదని జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛను బాధ్యతగా కాపాడుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. పుణెలో జరిగిన ప్రతిష్ఠాత్మక లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.
భారత్ ఎప్పటి నుంచో ఇలాగే ఉందని భావించడం సరికాదని, స్వాతంత్య్రం వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయని డోభాల్ పేర్కొన్నారు. లోక్‌మాన్య తిలక్ వంటి నాయకుల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని గుర్తు చేశారు. దేశం ముందున్న అరుదైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ డోభాల్‌కు అవార్డును ప్రదానం చేశారు. భారత విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో డోభాల్ కీలక పాత్ర పోషించారని అమిత్ షా ప్రశంసించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!