

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినీ నందమూరి సినీ రంగ ప్రవేశంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందే చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం కానున్నారనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా, భావోద్వేగాలతో పాటు బలమైన సందేశాన్ని అందించే కథను ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నారని, అన్ని అంశాలు ఖరారైన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన తేజస్వినీ డాన్స్ వీడియోలు కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్‌పై ప్రశంసలు రావడంతో వెండితెరపై ఆమె ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథ ఎంపిక నుంచి పాత్ర రూపకల్పన వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా దర్శకుడు, నిర్మాణ సంస్థ, ప్రారంభ తేదీ వంటి వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చిత్రబృందం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ ప్రచారం కొనసాగనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!