

గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. గాంధీజీ స్మారక స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం బాపూఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ విప్‌లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాపూఘాట్‌లోని ప్రార్థనా మందిరంలో గాంధీజీకి సంబంధించిన 400కుపైగా చిత్రాలతో కూడిన 76 అడుగుల పొడవైన చిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!