22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

Writer: Harika S 08:57 AM, 22 ఆగస్టు, 2026
తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

తెలంగాణలో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం.. రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశంపై ప్రముఖ విద్యావేత్తలతో చర్చించారు.

బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో సమావేశమైన సీఎం.. ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలను వివరించి, ఆక్స్‌ఫర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన కార్యక్రమాలను హైదరాబాద్‌కు తీసుకురావాలని కోరారు. తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేసేందుకు ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని వారిని ఆహ్వానించారు.

అనంతరం రేవంత్ రెడ్డి సోమర్‌విల్ కాలేజీని సందర్శించి, అక్కడ విద్యాభ్యాసం చేసిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. ఆ తర్వాత జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించి, సంస్థ ప్రతినిధులతో కలిసి క్రీడా మౌలిక సదుపాయాలను పరిశీలించారు. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని జీఎంఆర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా

హైదరాబాద్ సమీపంలో అరుదైన సప్తముఖ హనుమాన్ ఆలయం.. విశేషాలివే!

హైదరాబాద్ సమీపంలో అరుదైన సప్తముఖ హనుమాన్ ఆలయం.. విశేషాలివే!

తిరుమల పవిత్రోత్సవాలు: ఆగస్టు 23 నుంచి మూడు రోజుల వైభవం

తిరుమల పవిత్రోత్సవాలు: ఆగస్టు 23 నుంచి మూడు రోజుల వైభవం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతెలంగాణ రైజింగ్తెలంగాణ విద్యహైదరాబాద్ప్రపంచస్థాయి విద్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్
జనరల్

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..
జనరల్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!
సినిమాలు

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?
గాసిప్స్

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

జైలర్ 2: పూర్ణే హైలైట్!
సినిమాలు

జైలర్ 2: పూర్ణే హైలైట్!

విశ్వంభర ట్రీట్ లేనట్టేనా?
గాసిప్స్

విశ్వంభర ట్రీట్ లేనట్టేనా?

స్పిరిట్‌: అభిమానుల్లో ఆందోళన?
గాసిప్స్

స్పిరిట్‌: అభిమానుల్లో ఆందోళన?

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!
క్రీడలు

వైరల్ వికెట్ సెలబ్రేషన్‌తో మెహద్వీ బిధూరి.. నెట్టింట ఫుల్ క్రేజ్!

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
జనరల్

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌
జనరల్

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!