

ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య జన్మదినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా సమాజాన్ని మార్చే శక్తివంతమైన సాధనమని తన జీవితాచరణ ద్వారా నిరూపించిన గొప్ప వ్యక్తి చుక్క రామయ్య అని కొనియాడారు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలు ఎంతో విలువైనవని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
ముఖ్యంగా గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేలా మార్గనిర్దేశం చేసిన ఆయన కృషి చిరస్మరణీయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధ్యమవుతాయని నమ్మిన చుక్క రామయ్య ఆశయాలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా మరిన్ని సంవత్సరాలు జీవిస్తూ విద్యార్థులకు, సమాజానికి మార్గదర్శకులుగా కొనసాగాలని ఆకాంక్షించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!