
గాసిప్స్

హీరో నాని చేసిన వినతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా నిబంధనలను గౌరవిస్తూ, ప్రతిభావంతుడైన తెలంగాణ యువ దర్శకుడు ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి నాని చూపిస్తున్న నిబద్ధతను సీఎం అభినందించారు. ప్రజల భద్రత, జనసమూహాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఈ మేరకు అధికారిక దరఖాస్తును సంబంధిత స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని నానికి సీఎం సూచించారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీసు బృందం నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ డీజీపీ కార్యాలయం సమన్వయం చేసుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!