
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), ఉపాధ్యక్షుల (వైస్ ఎంపీపీ) ఎన్నికల ప్రక్రియలో ఎక్కువ భాగం పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 659 మండల పరిషత్‌లకు గాను 601 చోట్ల ఎన్నికలు ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెల్లడించింది. మరో 58 మండల ప్రజాపరిషత్‌లలో ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది.
పెండింగ్‌లో ఉన్న మండలాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయినట్లు వివరించింది. మిగిలిన మండలాల్లోనూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!