
జనరల్

జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జూలై 16న న్యూఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది.
ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంతో పాటు మిత్రపక్షాలతో సమన్వయం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీసే అంశాలపై చర్చ జరగనుంది. వర్షాకాల సమావేశాల్లో కీలక జాతీయ అంశాలపై ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు కార్యాచరణను ఖరారు చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!