

జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1,341.60 కోట్ల స్ట్రీట్ లైటింగ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) ప్రాజెక్టుకు సవరించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల నిర్వహణను 10 ఏళ్ల పాటు కొనసాగించనున్నారు. అలాగే రెండేళ్లలో అన్ని ఎల్‌ఈడీ వీధి దీపాల మార్పు, ఆరు నెలల్లో సీసీఎంఎస్ (CCMS) బాక్సుల మార్పు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ అర్హత ప్రమాణాల్లో కూడా మార్పులు చేసింది. సాల్వెన్సీ నిబంధనను కాంట్రాక్ట్ విలువలో 10 శాతానికి సవరించగా, ఈఎండీ (EMD), పెర్ఫార్మెన్స్ గ్యారంటీకి ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను అనుమతించింది. అదనంగా ప్రతి ఏడాది 15 వేల ఎల్‌ఈడీ వీధి దీపాల సరఫరా 10 ఏళ్ల పాటు కొనసాగించనున్నారు. అలాగే CURE ప్రాంత ప్రాజెక్టుకు జీహెచ్‌ఎంసీనే నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!