

యలహంక ఆస్తి వివాదంలో వైఎస్ షర్మిలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో షర్మిలకు వ్యతిరేకంగా బెంగళూరులోని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదంలో ఉన్న యలహంక ఆస్తిలోకి షర్మిల ప్రవేశించకూడదని ఆదేశించింది. ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా ఆస్తిలోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. సిలికాన్ బిల్డర్స్ సంస్థ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. సదరు ఆస్తి ప్రస్తుతం తమ స్వాధీనంలో ఉందని, 2027 ఫిబ్రవరి వరకు లీజు ఒప్పందం తమకు వర్తిస్తుందని సిలికాన్ బిల్డర్స్ సంస్థ కోర్టుకు తెలిపింది.
ఈ కేసు విచారణలో భాగంగా సిలికాన్ బిల్డర్స్ సమర్పించిన లీజు ఒప్పందం, అద్దె చెల్లింపుల వివరాలు, విద్యుత్ బిల్లులను బెంగళూరు కోర్టు పరిశీలించినట్లు సమాచారం. ఈ పత్రాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ఆస్తిలోకి ప్రవేశించకుండా మధ్యంతర ఆంక్షలు విధించింది. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 19 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. తదుపరి విచారణలో ఇరు పక్షాల వాదనలు, సమర్పించిన ఆధారాల ఆధారంగా ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!