

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడింది. దీనికి ‘అక్వాన్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాన్ చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ సమాచారం వెల్లడిస్తోంది. మంగళవారం నాటికి తీవ్ర తుఫాన్‌గా, నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని అంచనా. నవంబర్ 20న నెల్లూరు-తుని మధ్య తీరాన్ని దాటే అవకాశముండటంతో ఏపీ తీరప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
నవంబర్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ కదలికలు, వాతావరణ హెచ్చరికలపై అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!