
క్రీడలు

మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలో నల్లమడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నల్లమడ, నక్క వాగులకు గండ్లు పడటంతో వరదనీరు పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. పెదనందిపాడు, నాగులపాడు, కాకుమాను మండలంలోని కొమ్మూరు, గార్లపాడు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెదనందిపాడు-కొమ్మూరు, కొమ్మూరు-గార్లపాడు ప్రధాన రహదారులపై వరదనీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెదనందిపాడు నుంచి గుంటూరు, పర్చూరు వెళ్లే ప్రధాన మార్గాల్లోనూ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రహదారులు వరద నీటిలో మునిగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!