

వారం రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌ను రెండు తుఫాన్లు ప్రభావితం చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. నవంబర్ 4న ఉదయం జరిగిన ఈ సంభాషణలో అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని చంద్రబాబు ప్రధానికి వివరించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా పలు రంగాలకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
తుఫాన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, తుఫాన్ల వల్ల ఎదురైన ఇబ్బందులను సమర్థంగా అధిగమించారని చంద్రబాబును అభినందించారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, నష్టంపై వివరాలు తెలుసుకున్న ప్రధాని.. రాష్ట్రానికి అవసరమైన సహాయంపై సీఎం చేసిన విజ్ఞప్తిని పరిశీలించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!