

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు సాధించిన విజయంపై ఇరాన్ స్పందించింది. ఈ ఫలితాలు అమెరికా ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదనే సందేశాన్ని ఇస్తున్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, అమెరికాతో చర్చల్లో కీలక ప్రతినిధి మహమ్మద్ బాఘర్ గలిబాఫ్ వ్యాఖ్యానించారు. జీవన వ్యయం పెరగడం, యుద్ధ పరిణామాలపై అమెరికా ఓటర్లు అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల తీర్పును ప్రజల యుద్ధ వ్యతిరేక వైఖరికి సంకేతంగా అభివర్ణించారు.
ట్రంప్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గలిబాఫ్ హెచ్చరించారు. అమెరికా తన విధానాలను మార్చుకోవాలని, ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగించే వైఖరికి స్వస్తి పలకాలని ఆయన పరోక్షంగా సూచించారు. మరోవైపు, ఇరాన్‌తో యుద్ధం తమ పార్టీ ఎన్నికల ఓటమికి కొంతవరకు కారణమై ఉండొచ్చని ట్రంప్ కూడా అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!