
రాజకీయాలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించారు. బ్యాలెట్‌పై తన పేరు ఉండి ఉంటే రిపబ్లికన్ పార్టీ అఖండ విజయం సాధించేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను స్వయంగా ఎన్నికల బరిలో నిలిచి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డారు.
అయితే, మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నానని ట్రంప్ స్పష్టం చేశారు. డెమోక్రాట్లతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య సహకారంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!