

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే “డార్క్ ప్యాటర్న్స్” అనే మోసపూరిత డిజైన్‌ల వల్ల భారత వినియోగదారులు ఏటా సుమారు రూ.25,000–28,000 కోట్ల వరకు నష్టపోతున్నారని డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. దేశంలోని 30.4 కోట్ల ఆన్‌లైన్ కొనుగోలుదార్లలో 88% మంది హిడెన్ ఛార్జీలు, బలవంతపు యాడ్-ఆన్స్, డ్రిప్ ప్రైసింగ్, తప్పుడు ఆవశ్యకత చూపడం, సబ్‌స్క్రిప్షన్ ఉచ్చు వంటి కారణాలతో ప్రభావితమవుతున్నారని పేర్కొంది.
ఈ అధ్యయనం 12 ప్రముఖ ఈ-కామర్స్, క్విక్ కామర్స్, ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లపై నిర్వహించబడింది. 50 నగరాల్లోని 2,590 మంది వినియోగదారుల అభిప్రాయాలు సేకరించారు. 63% మంది అదనపు ఛార్జీలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అమెజాన్ అత్యంత విశ్వసనీయ ప్లాట్‌ఫామ్‌గా నిలవగా, ఫ్లిప్‌కార్ట్‌పై అవిశ్వాసం ఎక్కువగా నమోదైంది. ట్రావెల్ విభాగంలో మేక్‌మైట్రిప్ సురక్షితంగా, క్లియర్‌ట్రిప్ ప్రమాదకరంగా గుర్తించబడ్డాయి. 85% మంది ఈ మోసపూరిత పద్ధతులు తమను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!