

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి, రక్షణ రంగంలో శాస్త్రవేత్త జి. సతీశ్‌రెడ్డి తెలుగు ప్రజలకు గర్వకారణమైన ప్రముఖులని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. హైదరాబాద్‌లో బీవీ పట్టాభిరామ్ పేరుతో ఏర్పాటు చేసిన తొలి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారని, సతీశ్‌రెడ్డి దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని, సతీశ్‌రెడ్డితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సతీశ్‌రెడ్డి ప్రతిభను ముందుగానే గుర్తించారని తెలిపారు. డీఆర్డీవో అభివృద్ధి, స్వదేశీ రక్షణ ఉత్పత్తులు, కరోనా సమయంలో వైద్య పరికరాల తయారీలో సతీశ్‌రెడ్డి సేవలను ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రక్షణ, వైమానిక రంగ పరిశ్రమల ఏర్పాటుకు ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!