
జనరల్

హైదరాబాద్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎఐఎస్‌ఏ, ఏఎస్‌ఏ, డీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, టీఎస్‌ఎఫ్ కూటమి అభ్యర్థి దిల్షాదా రైహాన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తాజా ఫలితాల ప్రకారం దిల్షాదా రైహాన్ 221 ఓట్లతో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. టీఎస్‌ఎఫ్‌కు చెందిన కొర్ర నితిన్ చౌహాన్ 212 ఓట్లతో ఉపాధ్యక్షుడిగా, ఏఎస్‌ఏకు చెందిన ప్రతీక్ 177 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
అధ్యక్ష పదవికి ఏబీవీపీ-ఎస్‌ఎల్‌వీడీ కూటమి తరఫున పోటీ చేసిన నరేష్ పొడిశెట్టి 197 ఓట్లు సాధించారు. 2026 హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో సుమారు 5,900 మంది విద్యార్థులు ఓటు హక్కు కలిగి ఉండగా, తొమ్మిది కేంద్ర పదవులు, 59 పాఠశాల బోర్డు కౌన్సిలర్ స్థానాలకు మొత్తం 220 మంది అభ్యర్థులు పోటీ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!