
జనరల్

దీపావళి పండుగ సందర్భంగా స్వీట్ల వినియోగం, వాయు కాలుష్యంపై వైద్య నిపుణులు కీలక ఆరోగ్య సూచనలు జారీ చేశారు. పండుగ వేళ స్వీట్లు ఎక్కువగా తినకుండా పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అతిగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, వాయు కాలుష్యం ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
వాయు నాణ్యత సూచీ (AQI) 250కి చేరితే, రోజుకు 10 నుంచి 15 సిగరెట్లు తాగినంత కాలుష్య ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఎన్95 మాస్క్ ధరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!