

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 64 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) 28 స్థానాలు గెలుచుకుని ఆధిక్యంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 27 స్థానాలు సాధించగా, జనసేన ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.
మండలాల వారీగా చూస్తే.. పుట్టపర్తిలో టీడీపీ 8 స్థానాలు, కొత్తచెరువులో టీడీపీ 5, వైఎస్సార్‌సీపీ 6, బుక్కపట్నంలో టీడీపీ 4, వైఎస్సార్‌సీపీ 6, జనసేన ఒక స్థానం గెలుచుకున్నాయి. నల్లమాడలో టీడీపీ 4, వైఎస్సార్‌సీపీ 8, ఓ.డి.చెరువులో ఇరు పార్టీలు చెరో 7 స్థానాలు, అమడగూరులో టీడీపీ 7, వైఎస్సార్‌సీపీ ఒక స్థానం సాధించాయి. జడ్పీటీసీ ఎన్నికల్లో పుట్టపర్తిలో జనసేన, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడలో వైఎస్సార్‌సీపీ, ఓ.డి.చెరువు, అమడగూరులో టీడీపీ విజయం సాధించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!