
సినిమాలు

అమెరికాలో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్‌బ్లూ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టింది. లాస్ వెగాస్ నుంచి వచ్చిన ఈ విమానం సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో 159 మంది ప్రయాణికులు ఉన్నారు.
డ్రోన్ కాక్‌పిట్ వెలుపలి భాగాన్ని తాకిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు సమాచారం ఇచ్చాడు. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్ల ఎగురవేతపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!