
షోస్

హైదరాబాద్లో వీకెండ్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13, 14 తేదీల్లో నగరవ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 545 మందిని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుకున్నారు. వీరిలో అత్యధికంగా 459 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నందున పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
పట్టుబడిన వారిలో 239 మంది రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 51 నుంచి 100 మధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!