
సినిమాలు

ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. చమోలీ జిల్లాలోని నందాదేవి నేషనల్ పార్క్ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు సమాచారం. భూకంపం ప్రభావంతో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా తదితర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం కారణంగా ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
మరోవైపు అస్సాంలోనూ భూమి కంపించింది. అక్కడ రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సమాచారం. ఉత్తరాఖండ్, అస్సాంలో సంభవించిన భూప్రకంపనలకు సంబంధించి ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!