

దివంగత కాకా వెంకటస్వామి ఆశయాన్ని సాకారం చేసేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చడంతో పాటు సుమారు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి కలసి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.
ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు, అవసరమైన అనుమతులు, ఇతర సాంకేతిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎంపీ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర జల సంఘం (CWC) ప్రత్యేక సమావేశం నిర్వహించి, మహారాష్ట్రతో ఉన్న అంశాలను పరిష్కరించడంతో పాటు అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్టు పురోగతికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!