
షోస్

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు గురువారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విద్యుత్తు నియంత్రికలను పంపిణీ చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్తు శాఖ డీఈ చంద్రమౌళి, ఏడీఈ నవీన్ కుమార్, ఏఈ వెంకటేష్, రాజాపూర్ సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందుతున్న విద్యుత్తు సేవలు, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు వివరాలు తెలుసుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!