2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

Writer: Shivani K 06:19 AM, 2 అక్టోబర్, 2026
డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌ విడుదలకు నెల రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో గురువారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నోటిఫికేషన్‌ విడుదల నుంచి అభ్యర్థులకు పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ‘మిషన్‌ మార్చ్‌’ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

పాఠశాలల నుంచి విద్యార్థుల డ్రాప్‌అవుట్‌లను నివారించేందుకు కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములను చేస్తూ ‘జీరో డ్రాప్‌అవుట్‌ మిషన్‌’ చేపట్టాలని లోకేశ్ సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ వంటి కార్యక్రమాలను కొనసాగించాలని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పాఠశాలలను ‘లీప్‌ స్కూల్స్‌’గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం కేంద్రాల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్నారా లోకేశ్డీఎస్సీడీఎస్సీ నోటిఫికేషన్విద్యాశాఖమిషన్ మార్చ్జీరో డ్రాప్‌అవుట్ మిషన్లీప్ స్కూల్స్ఆటిజం కేంద్రాలుఉపాధ్యాయ నియామకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఊర్వశి రౌతేలా ఆరోపణలకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు స్పందన
సినిమాలు

ఊర్వశి రౌతేలా ఆరోపణలకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు స్పందన

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ
రివ్యూలు

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?
జనరల్

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్
జనరల్

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు
జనరల్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ
జనరల్

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ
జనరల్

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ
జనరల్

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

రంగనాయక సాగర్‌పై హరీశ్‌ రావు కీలక డిమాండ్
రాజకీయాలు

రంగనాయక సాగర్‌పై హరీశ్‌ రావు కీలక డిమాండ్

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!