
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ కాగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!