
జనరల్

విజయవాడ వెళ్తున్న 591 ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్.. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానంలో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సాంకేతిక సిబ్బంది విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!