

దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం గాల్లోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కొంది. FZ1073 విమానంలో పైలట్ల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఓ పైలట్‌పై కత్తితో దాడి జరిగినట్లు వచ్చిన వార్తలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానం అత్యవసర సంకేతాలను పంపడంతో దాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో సుమారు 180 మంది ప్రయాణికులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత హైజాక్ అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, పైలట్ల మధ్య జరిగిన ఘర్షణే ఘటనకు కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెప్టెన్ భారతీయుడని, కో-పైలట్‌తో పోరాడి ప్రయాణికులను కాపాడారని కొన్ని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే కెప్టెన్ జాతీయతతో పాటు ఘటనకు సంబంధించిన కొన్ని వివరాలపై అధికారిక ధ్రువీకరణ ఇంకా లేదు. పైలట్ల జాతీయతపై కూడా భిన్నమైన కథనాలు వెలువడుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!