

అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు అత్యంత సూక్ష్మమైన వైర్‌లెస్ బ్రెయిన్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేశారు. MOTE (Microscale Optoelectronic Tetherless Electrode)గా పిలిచే ఈ పరికరం సాధారణ ఉప్పు గింజ కంటే కూడా చిన్నది. కేవలం 300 మైక్రాన్ల పొడవు, 70 మైక్రాన్ల వెడల్పు కలిగిన ఈ చిప్ ఎలాంటి బ్యాటరీలు, వైర్లు లేకుండా కాంతి ఆధారంగా పనిచేస్తుంది. ఎలుకల మెదడులో అమర్చిన ఈ పరికరం ఏడాది పాటు న్యూరాన్ల విద్యుత్ సంకేతాలను నిరంతరాయంగా రికార్డ్ చేసింది.
MOTEకు ఎరుపు, ఇన్‌ఫ్రారెడ్ లేజర్ కిరణాల ద్వారా శక్తిని అందిస్తారు. మెదడులోని న్యూరల్ సిగ్నల్స్‌ను ఇన్‌ఫ్రారెడ్ లైట్ పల్స్‌లుగా మార్చి వైర్‌లెస్‌గా బయటకు పంపుతుంది. ప్రత్యేక మెటీరియల్స్‌తో రూపొందించిన ఈ పరికరం భవిష్యత్తులో MRI స్కాన్ల సమయంలో మెదడు సంకేతాలను పర్యవేక్షించేందుకు, అలాగే వెన్నుపాము, ఇతర శరీర కణజాలాల్లో నాడీ సంబంధిత వ్యాధుల అధ్యయనం, చికిత్సకు ఉపయోగపడే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!