

తెలుగు చిత్ర పరిశ్రమను మరోసారి ఆన్‌లైన్ పైరసీ సమస్య కలవరపెడుతోంది. ఇటీవల విడుదలైన నాలుగు సినిమాలు రణబలి, కల్ట్, ఆదర్శ కుటుంబం, ఆకాశంలో ఒక తార పైరసీ బారిన పడ్డాయి. ఈ సినిమాలను ఆన్‌లైన్‌లో అక్రమంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ థియేటర్‌లో మూడు సినిమాలను కొందరు వ్యక్తులు రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత ఇంటర్నెట్‌లో లీక్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్‌కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. థియేటర్‌లో సినిమాలను చిత్రీకరించిన వ్యక్తులు ఎవరు? వాటిని ఆన్‌లైన్‌లోకి ఎలా అప్‌లోడ్ చేశారు? పైరసీ వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనతో సినిమా నిర్మాణ సంస్థలకు పైరసీ వల్ల కలిగే నష్టాలపై మరోసారి చర్చ మొదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!