
బిజినెస్

అస్సాంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 రవాణా విమానం కూలిపోవడంతో మరణించిన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, అగ్నివీర్ డానిష్ ఆలమ్ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి కొన్ని గంటల ముందు శుభమ్ తన తల్లితో వీడియో కాల్లో మాట్లాడారు. ఎంతో ఉల్లాసంగా కనిపించిన ఆయన, పని ముగిసిన తర్వాత మళ్లీ మాట్లాడతానని చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆ కాల్నే వారి చివరి సంభాషణగా మిగిలిపోయింది.
భోజ్‌పుర్ జిల్లాకు చెందిన అగ్నివీర్ డానిష్ ఆలమ్ కూడా విమానంలో ఎక్కిన తర్వాత తీసుకున్న ఫొటోను కుటుంబ సభ్యులకు పంపించారు. శుక్రవారం సాయంత్రం వరకు ఆనందంగా మాట్లాడిన తన కుమారుడు ఇక లేడనే విషయాన్ని తల్లి అఖ్తారీ బేగం జీర్ణించుకోలేకపోతున్నారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన ఈ ఇద్దరు యువ వీరుల జ్ఞాపకాలు వారి కుటుంబాలను కన్నీటిలో ముంచెత్తుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!