

‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి, తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విజయానికి ఎలాంటి ఫార్ములాను తాను నమ్మలేదని, సినిమాపై ఉన్న నిజమైన ఆసక్తి, ప్రతి సినిమా ద్వారా నేర్చుకున్న అనుభవాలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె, షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ తన నటనపై మరింత దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దర్శకులు తనను విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రల కోసం సంప్రదించడం సంతోషంగా ఉందని త్రిప్తి అన్నారు. సినిమా ఎంత పెద్దదైనా, కథతో పాటు తాను పోషించే పాత్రతో భావోద్వేగ అనుబంధం ఏర్పడితేనే అంగీకరిస్తానని స్పష్టం చేశారు. ప్రేక్షకుల అంచనాలు తనకు ఒత్తిడిని కాకుండా మరింత ప్రేరణను ఇస్తాయని, మంచి కథలు చెప్పే ప్రతిభావంతులైన దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తూ ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు అందించడమే తన లక్ష్యమని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!