
సినిమాలు

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లోని మొత్తం 7,437 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఆన్‌లైన్ విధానంలో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని నియామక మండలి స్పష్టం చేసింది. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు అంగీకరించబడవు. అభ్యర్థులు అర్హత ప్రమాణాలను ముందుగానే పరిశీలించి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!