
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్య ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దాదాపు 13 వేల మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శించిన ఈ నృత్యం తనను ఎంతో కదిలించిందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందించిన అపూర్వ స్వాగతం వారి ఆత్మీయతకు ప్రతీక అని ప్రధాని అన్నారు. థింసా నృత్యం రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబించిందని, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చిందని మోదీ అభినందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!