

దేశవ్యాప్తంగా నకిలీ కరెన్సీ చలామణిని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని బ్యాంకు శాఖల్లో నోట్ల ధ్రువీకరణ, సార్టింగ్ యంత్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసి, ఖాతాదారులు సమర్పించే ప్రతి నోటును యంత్రాల ద్వారా పరిశీలించిన తర్వాతే స్వీకరించాలని ఆదేశించింది. నకిలీ నోటు గుర్తించినట్లయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
నగదు లావాదేవీలు నిర్వహించే సిబ్బందికి ఈ ఏడాది అక్టోబర్‌లోగా అసలు, నకిలీ నోట్లను గుర్తించే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కూడా ఆర్‌బీఐ సూచించింది. నకిలీ నోట్ల గుర్తింపు, రిపోర్టింగ్, పర్యవేక్షణకు సంబంధించి సమగ్ర విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. కొన్ని బ్యాంకులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!