
బిజినెస్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. గణేశ్ నిమజ్జనం, శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చార్మినార్ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించి భారీగా భద్రతా బలగాలను మోహరించారు. బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చార్మినార్ సమీపంలోని దుకాణాలను తాత్కాలికంగా మూసివేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!